క్రిష్, పవన్ పిరియాడికల్ మూవీ.. హీరోయిన్ ఎవరు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఒక షెడ్యూల్ పూర్తి కాగా త్వరలో మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. పవన్ కెరియర్ లో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో పవన్ స్పెషల్ గా కనిపిస్తారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ భామ ఐశ్వర్యా రాజేష్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో శైలజా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో నటించిన ఐశ్వర్యా రాజేష్ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేదు. పవన్ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా చేస్తే మాత్రం తప్పకుండా ఆమె టాలీవుడ్ కెరియర్ కు మంచి బూస్టింగ్ వచ్చినట్టే అవుతుంది.