యువ హీరోకి లక్కీ ఛాన్స్.. ఏకంగా చిరంజీవితో..!

యువ హీరో సత్యదేవ్ కు లక్కీ ఛాన్స్ వరించింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే ఛాన్స్ అందుకున్నాడు సత్యదేవ్. చిరు హీరోగా మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను మోహన రాజా డైరెక్ట్ చేయనున్నారని తెలిసిందే. సినిమాలో ఒక యువ హీరో నటిస్తాడని వార్తలు రాగా ఆ ఛాన్స్ అందుకున్నాడట సత్య దేవ్. సైడ్ రోల్స్ చేస్తూ తన టాలెంట్ తో హీరోగా ప్రమోట్ అయిన సత్య దేవ్ ఏకంగా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ ఛాన్స్ అందుకున్నాడు.

2020 లాక్ డౌన్ టైంలో అందరు హీరోల సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోగా సత్యదేవ్ మాత్రం లాస్ట్ ఇయర్ నాలుగు సినిమాలు రిలీజ్ చేశాడు. లాస్ట్ ఇయర్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, తిమ్మరుసు సినిమాలు చేస్తున్న సత్య దేవ్ చిరు లూసిఫర్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. మెగాస్టార్ మూవీ ఛాన్స్ సత్య దేవ్ కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.