నితిన్ 'రంగ్ దే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

యువ హీరో నితిన్ లాస్ట్ ఇయర్ భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. సినిమాలో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. దెవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. న్యూ ఇయర్ సందర్భంగా రంగ్ దే నుండి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చింది. మార్చ్ 26న నితిన్ రంగ్ దే రిలీజ్ ప్లాన్ చేశారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ ల జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతుంది. ఈ సినిమా తర్వాత నితిన్, చంద్ర శేఖర్ యేలేటి డైరక్షన్ లో చేస్తున్న చెక్ సినిమా కూడా జూన్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. భీష్మతో తిరిగి ఫాం లోకి వచ్చిన నితిన్ రంగ్ దే, చెక్ లతో హిట్ మేనియా కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.