
కోవిడ్ వల్ల థియేటర్లు మూతపడగా లాక్ డౌన్ లో 8,9 నెలల దాకా థియేటర్లు తెరచుకోలేదు. ఈలోగా ప్రేక్షకులు కొందరు ఓటిటిలో సినిమాలకు అలవాటు పడ్డారు. ఇదిలాఉంటే సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డిసెంబర్ 25న డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
అయితే ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సినిమాను 9 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో అమ్మగా ఇప్పటికే ఎనిమిదిన్నర కోట్ల దాకా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఏడవ రోజు 0.32 కోట్లతో ఏడు రోజులకు మొత్తం 8.49 కోట్ల వసూళ్లను రాబట్టింది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా. ఈ సినిమా వసూళ్లు చూసిన తర్వాతనే సంక్రాంతి సినిమాలకు ఒక నమ్మకం వచ్చింది. మొత్తానికి థియేటర్లు తెరవగానే అందరు వెనకడుగు వేస్తుంటే సోలోగా వచ్చి సోలో బ్రతుకే సో బెటర్ తో హిట్ అందుకున్నాడు సాయి ధరం తేజ్.