
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా మొదలవబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా వచ్చింది. కమర్షియల్ గా సూపర్ కాకపోయినా జస్ట్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా తర్వాత మరోసారి త్రివిక్రం, తారక్ కలిసి సినిమా చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రని సెలెక్ట్ చేసినట్టు టాక్. కన్నడ సినిమాలు తెలుగులో డబ్ చేయడంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం ఉన్న ఉపేంద్ర త్రివిక్రం, అల్లు అర్జున్ కలిసి చేసిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా నటించాడు. ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ సినిమాలో కూడా విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ తో ఉపేంద్ర ఫైట్ ఎలా ఉండబోతుందో చూడాలి.