
న్యూ ఇయర్ రోజు ట్రిపుల్ R ట్రీట్ ఉంటుందని ఊహించిన మెగా నందమూరి ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న R.R.R సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 2021 రిపబ్లిక్ డే నాడు ట్రిపుల్ ఆర్ టీజర్ వస్తుందట. సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ తో పాటుగా హాలీవుడ్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ కూడా ఈ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇప్పటికే భీం, రామరాజు టీజర్ లు సినిమాపై అంచనాలు పెంచగా RRR అసలు సిసలైన టీజర్ ను జనవరి 26న రిలీజ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. సినిమా ప్రమోషన్స్ లో కూడా తన మార్క్ చూపించే జక్కన్న R.R.R టీజర్ ఎలా వదులుతాడో చూడాలి.