
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. అరవింద సమేత తర్వాత ఎన్.టి.ఆర్, త్రివిక్రం చేస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్నకు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
కన్నడ లో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రష్మిక తెలుగులో ఛలోతో మొదటి సినిమా హిట్ అందుకుంది.. ఆ తర్వాత గీతా గోవిందం కూడా సూపర్ హిట్ అవడంతో స్టార్ హీరోల దృష్టిలో పడ్డది. ఈ ఇయర్ మొదట్లో సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ భీష్మ సినిమాల్లో నటించి హిట్ అందుకుంది రష్మిక. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడ ఛాన్స్ అందుకున్న రష్మిక ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి తెలుగులో రష్మిక అతి తక్కువ కాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. అమ్మడి జోష్ చూస్తుంటే మరో ఐదారేళ్లు ఇలానే కెరియర్ కొనసాగించేలా ఉంది.