
థియేటర్లు మూతపడటంతో ఓటిటిల మీద ఆసక్తి చూపిస్తున్నారు సినీ ప్రియులు. వారిని ఆకట్టుకునేందుకు మంచి కాన్సెప్ట్ తో వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ ల కన్నా కంప్లీట్ తెలుగు ఓటిటిగా ఆహా మరింత జోష్ కనబరుస్తుంది. పూర్తిగా తెలుగు కంటెంట్ తో ఆహాలో వెబ్ సీరీస్, సినిమాలు ఉంటున్నాయి. ఓ పక్క సమంతతో సాం జాం షోతో పాటుగా ఎంటర్టైన్ చేసే వెబ్ సీరీస్ లను చేస్తున్నారు.
ఆహాలో రాబోతున్న మరో కొత్త వెబ్ సీరీస్ కంబాలపల్లి కథలు. స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఉదయ్ గుర్రాల డైరెక్ట్ చేసిన కంబాలపల్లి కథలు చాప్టర్ 1 మెయిల్ వెబ్ సీరీస్ టీజర్ రిలీజ్ చేశారు. 2005 అప్పుడే ఊళ్లో కంప్యూటర్ వచ్చిన టైం లో కంప్యూటర్ గురించి దాని గురించి తెలిసిన ఓ వ్యక్తి ఎలా చెప్పాడు.. ఆ ఇన్ స్ట్యూట్ ఎలా నడిచింది అన్న కథతో ఈ వెబ్ సీరీస్ వస్తుంది. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు అప్పటి రోజుల్లో తమ ఎక్స్ పీరియన్స్ ను గుర్తుచేసుకోకుండా ఉండలేరు. మెయిల్ టీజర్ మెప్పించింది.. సంక్రాంతికి వెబ్ సీరీస్ చాప్టర్ 1 ఆహాలో రిలీజ్ అవుతుంది. టీజర్ ఇంప్రెస్ చేసింది కాబట్టి వెబ్ సీరీస్ కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని చెప్పొచ్చు.