చరణ్ వెంటే ఉపాసన..!

మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే. చరణ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పి ఈమధ్య కాలంలో తనని కలిసి వారంతా కూడా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. అయితే ఎలాంటి లక్షణాలు లేకుండానే చరణ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.

చరణ్ కు కరోనా అని తేలగానే అతనితో పాటు హోం క్వారెంటైన్ లో ఉన్నారు ఉపాసన. తనకు నెగటివ్ రిపోర్ట్ వచ్చినా సరే పాజిటివ్ వచ్చేందుకు ఛాన్సులు ఉన్నాయని. మిస్టర్ 'సి'తో క్వారెంటైన్ లో అంటూ ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతేకాదు ఇది కూడా వెళ్లిపోతుంది.. 2021 ఉండాలని ఆశిస్తున్నా అంటూ ఉపాసన కామెంట్ చేశారు. చరణ్ కు కోవిడ్ పాజిటివ్ రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఉపాసన కూడా తనతో క్వారెంటైన్ లో ఉండటం చూసి మెగా ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు.