
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మాస్టర్. ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఆ సినిమా హిట్ అవడంతోనే విజయ్ సినిమా ఛాన్స్ అందుకున్నాడు. లాక్ డౌన్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడగా ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
విజయ్ మాస్టర్ 2021 జనవరి 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వస్తుంది. సినిమాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ నటిస్తుండగా.. విజయ్ కు విలన్ గా విజయ్ సేతుపతి నటించడం విశేషం. తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా మాస్టర్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఈమద్యనే రిలీజైన తెలుగు టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన విజయ్ తెలుగు ఆడియెన్స్ ను అలరించడంలో వెనకపడ్డాడు. మాస్టర్ తో తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్న విజయ్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.