మారుతి 'పక్కా కమర్షియల్'

ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. కరోనా లాక్ డౌన్ టైం లో రెండు మూడు కథలు పూర్తి చేసిన మారుతి మాస్ మహ రాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఏవో కారణాల వల్ల రవితేజ ప్లేస్ లో గోపీచంద్ వచ్చి చేరాడట. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.

ఈ సినిమాకు టైటిల్ గా పక్కా కమర్షియల్ అని ఫిక్స్ చేశారట. మారుతి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈరోజుల్లో సినిమా నుండి ప్రతిరోజూ పండుగే సినిమా వరకు మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనిపించుకున్నాడు. ఇక హీరో ఎవరో కన్ఫాం అవని ఈ సినిమాకు పక్కా కమర్షీల్ అంటూ ఫిక్స్ చేశారు. సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది.