రాం చరణ్ కు కరోనా పాజిటివ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని వెళ్లడించారు. వారం పది రోజులకు ఒకసారి కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్న రాం చరణ్ ప్రతిసారి నెగటివ్ రిపోర్ట్ రాగా ఈసారి మాత్రం కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్ రావడంతో ఈమధ్య కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న వారు కూడా టెస్ట్ చేయించుకోవాలని అన్నారు రాం చరణ్. ఇక రికవరీ అప్డేట్స్ ను అందిస్తానని ట్వీట్ చేశారు.

ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ అని అన్నారు.. అయితే టెస్ట్ చేయించిన కిట్ ప్రాబ్లం వల్లే పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని.. తర్వాత టెస్ట్ చేస్తే నెగటివ్ రావడంతో మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు చరణ్ కు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం హోం క్వారెంటైన్ లో ఉంటున్న చరణ్ కొద్దిరోజుల వరకు షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది.