
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో క్రేజీ మూవీగా వస్తుంది క్రాక్. రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. టీజర్ తో మెప్పించిన క్రాక్ ట్రైలర్ కోసం మాస్ రాజా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రాక్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న క్రాక్ ట్రైలర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. 2021 సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ ప్లాన్ చేయగా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు. సంక్రాంతి రేసులో రామ్ రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్, అల్లరి నరేష్ బంగారు బుల్లోడుతో పాటుగా రవితేజ క్రాక్ కూడా రిలీజ్ అవుతుంది. సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజై మంచి వసూళ్లను రాబడుతుంది. అందుకే సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైంది.