మహేష్ కోసం గుణశేఖర్, శ్రీను వైట్ల..!

జనవరిలో సర్కారు వారి పాట సినిమా మొదలు పెడుతున్న సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాను 2021 ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో మూవీ వస్తుందని టాక్. 

రాజమౌళి సినిమాకు ముందు మహేష్ మరో సినిమా చేయాలని చూస్తున్నాడట. అయితె సూపర్ స్టార్ తో సినిమాలు చేసేందుకు లైన్ లో త్రివిక్రం, వంశీ పైడిపల్లి ఉన్నారు. వీరితో పాటు గుణశేఖర్, శ్రీను వైట్ల కూడా మహేష్ తో సినిమా ప్రయత్నాల్లో ఉన్నారట. రుద్రమదేవి తర్వాత రానాతో హిరణ్యకశ్యప సినిమా చేయాలని అనుకున్న గుణశేఖర్ ఆ సినిమా వెనకపడటంతో శాకుంతలం సినిమా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత మహేష్ కోసం ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. మహేష్ ఓకే అంటే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇక శ్రీను వైట్ల కూడా మహేష్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో దూకుడు సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వచ్చిన ఆగడు మాత్రం నిరాశపరచింది. మరి మహేష్ ఈ ఇద్దరు దర్శకులకు ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.