
సూపర్ స్టార్ రజినీకాంత్ హై బీపీ వల్ల హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. రజినీ నటిస్తున్న అన్నాత్తే షూటింగ్ కోసం భాగ్యనగరం వచ్చిన రజినీ సెట్స్ లో నలుగురికి కరోనా పాజిటివ్ రావడం రజినీకి అనారోగ్య సమస్యలు ఎదురవడం ఫ్యాన్స్ ను కంగారు పడేలా చేశాయి. అయితే కేవలం హై బీపీ వల్లే రజిని హాస్పిటల్ కు వెళ్లారని.. కరోనా లక్షణాలు ఏమీ లేవని తెలిసింది. రజినీ హెల్త్ అప్డేట్స్ ను అపోలో హాస్పిటల్ వారు ఎప్పటికప్పుడు అందించారు.
రజినీకాంత్ ఆరోగ్యం పూర్తి గా మెరుగు పడ్డదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. అన్నిరిపోర్టులు బాగానే ఉండటం వల్ల రజినీని డిశ్చార్జ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రజినీ కుటుంబ సభ్యులు తెలిపారు.