ఆచార్య సెట్ లో రాం చరణ్ సందడి..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. సినిమాలో చరణ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. చరణ్ ఉన్న ఆ 40 నిమిషాలు సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత ఈమధ్యనే షూటింగ్ స్టార్ట్ చేయగా ఆదివారం చరణ్ ఆచార్య సెట్ లో సందడి చేసినట్టు తెలుస్తుంది.

సినిమాలో తన పోర్షన్ షూటింగ్ త్వరలో స్టార్ట్ చేస్తారని టాక్. అందుకే ముందు లొకేషన్ కు వెళ్లి చూసి వచ్చారట. ఆర్.ఆర్.ఆర్ కు బ్రేక్ ఇచ్చి ఆచార్యకు ఓ 20 రోజుల షెడ్యూల్ డేట్స్ ఇచ్చారట రాం చరణ్. ఆచార్యలో రాం చరణ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని చెప్పొచ్చు. చిరు, చరణ్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే మెగా ఫ్యాన్స్ కు అంతకుమించిన పండుగ మరేదైనా ఉంటుందా చెప్పండి. అందుకే ఆచార్య మీద మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మనిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్, చరణ్ కు జోడీగా పూజా హెగ్దే నటిస్తుందని అంటున్నారు.