పుష్ప విలన్ అతనేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్నని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మారేడిమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ను ఢీ కొట్టే విలన్ ఎవరన్నది ఫిక్స్ అవలేదు.

సుదీప్, ఉపేంద్ర, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ను పరిశీలనలో ఉండగా ఫైనల్ గా కోలీవుడ్ హీరో ఆర్యని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ కండల వీరుడు ఆర్య తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అతని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించాడు ఆర్య. ఆ సినిమా ఫ్లాప్ అయినా పుష్పతో ఈ కాంబో హిట్ అందుకోవాలని చూస్తున్నారు.