పవన్ పర్మిషన్ ఇవ్వబట్టే..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో క్రిష్ ఒకరు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అలరిస్తున్న క్రిష్ ప్రస్తుతం మెగా హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ పవర్ స్టార్ తో క్రేజీ మూవీ మొదలుపెట్టిన క్రిష్ ఆ సినిమాకు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేశాడు. పవన్ సినిమా మధ్యలో వైష్ణవ్ తేజ్ మూవీ చేయడానికి పవన్ పర్మిషన్ తీసుకున్నానని చెప్పారు క్రిష్.

పవన్ తో సినిమా చేసే టైం లోనే కొద్దిగా గ్యాప్ రాగా ఈలోగా మీరు మరో సినిమా చేసుకోండని చెప్పారని.. ఆ టైం లో కొండపొలం నవల చదివి సినిమాగా తీయాలని అనుకున్నానని అన్నారు క్రిష్. వెంటనే నవల హక్కులను కొనడం సినిమాగా కథ మలచడం జరిగిందట. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ రాయలసీమ అమ్మాయి ఓబులమ్మగా నటిస్తుందని క్రిష్ చెప్పారు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కాకుండానే క్రిష్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఉప్పెనకు ముందు క్రిష్ సినిమానే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.