
ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. రవితేజ తో మారుతి సినిమా చేస్తాడని అనుకోగా ఏమైందో ఏమో కాని ఆ సినిమాలో రవితేజ బదులుగా ఇప్పుడు గోపీచంద్ వచ్చినట్టు తెలుస్తుంది. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే.. మరి రవితేజ ఎందుకు కాదన్నాడో కాని గోపీచంద్ ఈ సినిమాలో భాగమవుతున్నాడని తెలుస్తుంది.
ప్రస్తుతం గోపీచంద్ సీటీమార్ సినిమాలో నటిస్తున్నాడు. సంపత్ నంది డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటుగా తేజ డైరక్షన్ లో అలిమేలు వెంకటరమణ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనకపడ్డ గోపీచంద్ రాబోయే సినిమాలతో ఫాం లోకి వచ్చేలా ఉన్నాడు.