
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఉండే చరణ్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ కు జోడీగా రష్మిక నటిస్తుందని అన్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం రష్మిక ప్లేస్ లో పూజా హెగ్దేని ఈ సినిమాలో సెలెక్ట్ చేసినట్టు టాక్. రష్మిక కన్నా పూజా హెగ్దే అయితేనే ఇంకాస్త ఎక్కువ ఇంప్యాక్ట్ ఉంటుందని బుట్టబొమ్మని ఆచార్య కోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఆచార్య సినిమాలో చరణ్ సరసన నటించేది ఎవరన్నది అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చాకే తెలుస్తుంది.