
ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు తప్పకుండా రిలీజ్ చేసే అల్లరి నరేష్ ఈమధ్య పూర్తిగా తన జోరు తగ్గించాడు. రొటీన్ కామెడీ అంటూ ఆడియెన్స్ అల్లరోడి సినిమాలను ఆదరించడం మానేశారు. అందుకే అల్లరి నరేష్ ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డాడు. హీరోగానే కాదు స్టార్ సినిమాల్లో సైడ్ రోల్ కూడా చేస్తూ వచ్చాడు అల్లరి నరేష్. లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటించి మెప్పించాడు అల్లరి నరేష్.
ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా అనీల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా బంగారు బుల్లోడు. పి.వి.గిరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2021 సంక్రాంతి రేసులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రవితేజ క్రాక్, రాం రెడ్ సినిమాలు పొంగల్ రేసులో ఉండగా లేటెస్ట్ గా బంగారు బుల్లోడు కూడా వస్తున్నాడు. రవితేజ, రాం లతో పోటీ పడుతున్న అల్లరి నరేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.