
105 రోజుల బిగ్ బాస్ సీజన్ 4 ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడింది. ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గవ సీజన్ ఆదివారంతో ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 4 19 మంది కంటెస్టంట్స్ లో ఫైనల్ వీక్ కు ఐదుగురు ఫైనలిస్టులుగా వచ్చారు. ఇక వారిలో ఆడియెన్స్ ఓటింగ్ తో ఫైనల్ విన్నర్ ను ఎంపిక చేశారు.
రెండు మూడు వారాల నుండే ఈ సీజన్ విన్నర్ అభిజీత్ ఫిక్స్ అని సోషల్ మీడియాలో హడావిడి తెలిసిందే. అనుకున్నట్టుగానే ఆడియెన్స్ ఓటింగ్ తో అభిజీత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. రన్నరప్ గా అఖిల్ ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. టాలీవుడ్ బిగ్ బాస్.. బిగ్ బాస్ షోకి రావడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సీజన్ 4 విన్నర్ ను హోస్ట్ నాగార్జున ప్రకటించగా మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ షీల్డ్ అందించారు.
టాప్ 3లో ఉన్న సోహెల్ నాగార్జున ఆఫర్ చేసిన పాతిక లక్షలతో తనంతట తనే ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 4 ప్రైజ్ మనీ 50 లక్షలు కాగా అందులోంచి పాతిక లక్షలు సోహెల్ తీసుకొని బయటకు వచ్చాడు. అయితే అందులో 10 లక్షలు ఆర్పనైజ్ హోం కు డొనేట్ చేస్తానని సోహెల్ చెప్పడంతో.. నీ పాతిక లక్షలు నీ దగ్గరే ఉంచుకో.. నువ్వు ఇవ్వాలనుకున్న పది లక్షలు నేను ఇస్తా అని సోహెల్ కు చెప్పారు. ఇక మెహబూబ్ కు మెగాస్టార్ చిరంజీవి 10 లక్షల చెక్ అందించడం విశేషం. ఫైనల్ ఎపిసోడ్ అనుకున్న విధంగానే సూపర్ సక్సెస్ అయ్యింది.