సిఎం జగన్ కు కృతజ్ఞతలు..!

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి సినీ పరిశ్రమకు అండగా ఉండేందుకు సినిమాస్ రీ స్టార్ట్ ప్యాకేజ్ ను ప్రకటించారు. కరోనా వల్ల దెబ్బతిన్న సినీ పరిశ్రమకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్లు మూతపడ్డాయి కాబట్టి థియేటర్లు చెల్లించాల్సిన మూదు నెలల కరెంట్ బిల్లులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

అంతేకాదు మిగతా ఆరు నెలల పవర్ బిల్లులను వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించింది. థియేటర్లు రుణాలు, మారటోరియం విషయంలోనూ ఏపీ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం అందించిన ఈ ప్రత్యేక ప్యాకే గురించి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలియచేశారు. సినిమా రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఎగ్జిబిటర్లను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఏపీ సిఎం జగన్ గారికి ధన్యవాదాలు అన్నారు చిరంజీఎవి. ఈ నిర్ణయం వల్ల థియేటర్లతో పాటు ఎంతోమంది కార్మికులు లబ్ధి చేకూరుతుందని అన్నారు చిరంజీవి.