RRR వి.ఎఫ్.ఎక్స్ కు భారీ బడ్జెట్..!

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 400 కోట్ల బడ్జెట్ తో వస్తుందని తెలిసిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ తమ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని చిత్రయూనిట్ చెబుతున్నారు. అయితే సినిమాకు సంబందించిన వి.ఎఫ్.ఎక్స్ వర్క్స్ భారీగా ఉంటాయని తెలుస్తుంది.

సినిమాలో ఎక్కువ బడ్జెట్ వీటికే కేటాయిస్తున్నారట. రాజమౌళి సినిమా అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయని తెలుస్తుంది. సినిమాకు అవే స్పెషల్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక మెగా, నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని సినిమాలో ఉండేలా చూస్తున్నారు రాజమౌళి. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నారు జక్కన్న.