
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నూతన దర్సకుడు సుబ్బు డైరక్షన్ లో వస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది.
థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ఆడియెన్స్ కు నచ్చేశాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ వస్తుంది. ఈ సినిమాలో ప్రేమ, పెళ్లి అనేవి లేకుండా సోలోగానే ఉండాలనుకునే హీరోకి హీరోయిన్ దగ్గవడం ఆ తర్వాత అతనేం చేశాడన్నదే సినిమా కథ. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా సాయి ధరం తేజ్ ఖాతాలో మరో హిట్ అందించేలా ఉందని చెప్పొచ్చు.