
నిర్మాత దిల్ రాజు 50వ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన పార్టీలో టాలీవుడ్ స్టార్స్ అంతా వచ్చారు. ఈ ఈవెంట్ లో దాదాపు టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఒకచోట చేరినట్టు అనిపించింది. కేవలం కొంతమంది స్టార్స్ మాత్రమే ఈ పార్టీకి అటెండ్ అవలేదు. అయితే దిల్ రాజుతో సినిమాలు తీసి హిట్లు కొట్టిన ఓ ఇద్దరు స్టార్స్ మాత్రం ఈ బర్త్ డే పార్టీ మిస్ అయ్యారు.
ఇంతకీ దిల్ రాజు బర్త్ డే పార్టీ మిస్సైన హీరోలు ఎవరంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఈ ఇద్దరు స్టార్స్ ఈ పార్టీని స్కిప్ చేయడం ఏంటని డౌట్ పడుతున్నారు. సీనియర్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే అటెండ్ అయ్యారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలు కూడా దిల్ రాజు బర్త్ డే పార్టీలో పాల్గొనలేదు.