
టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. దిల్ రాజు 50 క్రాస్ అయిన సందర్భంగా స్పెషల్ బర్త్ డే బాష్ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి టాలీవుడ్ స్టార్స్ అంతా అటెండ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, రాం చరణ్, ప్రభాస్ లతో పాటుగా కె.జి.ఎఫ్ హీరో యశ్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.
దిల్ రాజు బర్త్ డే పార్టీలో తారలంతా సందడి చేశారు. అందరు స్టార్స్ ఒకే పార్టీలో పాల్గొనడం చాలా అరుదు. అలాంటి వేదిక సెట్ చేశాడు దిల్ రాజు. అయితే దిల్ రాజు బర్త్ డే పార్టీకి నందమూరి హీరోలెవరు రాలేదని తెలుస్తుంది. బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం వీరెవరు ఈ పార్టీకి అటెండ్ అవలేదని సమాచారం. అంతేకాదు వెంకటేష్, నాగార్జున కూడా పార్టీని స్కిప్ చేశారని తెలుస్తుంది.