నాని 'టక్ జగదీష్' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

V సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో నాచురల్ స్టార్ నాని సినిమా కథల మీద మరింత ఫోకస్ పెట్టాడని చెప్పొచ్చు. రిస్క్ తీసుకుంటే కెరియర్ లో వెనకపడతామని గుర్తించిన నాని ఇక మీదట పక్కా హిట్ అనుకునే కథలనే చేయాలని చూస్తున్నాడట. అఫ్కోర్స్ కథలు బాగున్నా కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి. ప్రస్తుతం నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు. సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసం నాని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వారికోసమే డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. నాని టక్ జగదీష్ నుండి క్రిస్మస్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారని తెలుస్తుంది. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమేనా చిన్న టీజర్ ఏదైనా రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికీ సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడు.