బిగ్ బాస్ 4 ఫైనల్ గెస్ట్ ఆయనేనా..!

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారానికి వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో టైటిల్ విజేతని ఎనౌన్స్ చేస్తారు. ఈ సీజన్ లో 19 మంది హౌజ్ మేట్స్ రాగా ఫైనలిస్టులుగా ఐదుగురు మాత్రమే ఉన్నారు. అఖిల్, సోహెల్, అభిజిత్, అరియానా, హారికలు టాప్ 5 గా నిలిచారు. ఇక వీరిలో టైటిల్ ఎవరు గెలుస్తారన్నది ఈ ఆదివారం తెలుస్తుంది. 

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ ను ఎనౌన్స్ చేసేందుకు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నట్టు టాక్. సీజన్ 3 టైంలో కూడా ఫైనల్స్ కు చిరు గెస్ట్ గా వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ గెస్ట్ గా వస్తున్నారట. చిరు చేతుల మీదుగానే టైటిల్ విజేత షీల్డ్, క్యాష్ ప్రైజ్ అందుకుంటారని తెలుస్తుంది. సీజన్ 4 ఫైనల్ విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు బిగ్ బాస్ టీం.