రానా 'హిరణ్యకశ్యప'కు త్రివిక్రం మాటలు..!

దగ్గుబాటి రానా సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విరాటపర్వం సినిమా చేస్తున్న రానా ఆ సినిమా తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సాగర్ చంద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత రానా డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశ్యప సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. గుణశేఖర్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ మూవీగా ప్లాన్ చేసిన ఈ మైథలాజికల్ మూవీకి త్రివిక్రం హెల్ప్ తీసుకుంటున్నారట. కథ, స్క్రీన్ ప్లే గుణశేఖర్ అందిస్తుండగా.. త్రివిక్రం ఈ సినిమాకు మాటలు అందిస్తాడని తెలుసుతంది. త్రివిక్రం పెన్ పవర్ హిరణ్యకశ్యపకు ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. అల వైకుంఠపురములో హిట్ అవడంతో త్రివిక్ర నెక్స్ట్ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఎన్.టి.ఆర్ తో సినిమా ఉంటుందని తెలుస్తుండగా ఆ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఇంకా బయటకు రాలేదు.