
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ఏంటన్నది ఇంకా రివీల్ చేయలేదు. ఇక ఈ సినిమా తర్వాత బి.గోపాల్ డైరక్షన్ లో బాలయ్య బాబు సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా యువ హీరో నాగ శౌర్యతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ సినిమాను కన్నడ డైరక్టర్ శ్రీమాన్ డైరెక్ట్ చేస్తాని అంటున్నారు. ఈ సినిమాలో నాగ శౌర్య చెవిటి, మూగ పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ రంగస్థలం సినిమాలో డెఫ్ అండ్ డమ్ రోల్ లో చిట్టిబాబు చితక్కొట్టేశాడు. ఇప్పుడు నాగ శౌర్య కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో బాలకృష్ణ మెయిన్ హీరో కాగా నాగ శౌర్య 30 నిమిషాల రోల్ చేస్తాడని. చెవిటి, మూగ పాత్రలో క్యారక్టర్ చాలా ఫన్నీగా ఉంటుందని అంటున్నారు. కాంబో సూపర్ అనిపించేలా ఉండగా ఈ సినిమా గురించి అఫీషియల్ న్యూస్ వస్తేనే గాని అసలు మ్యాటర్ ఏంటన్నది తెలుస్తుంది.