నెట్ ఫ్లిక్స్ చేతికి ఉప్పెన..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఉప్పెన. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మించారు. సినిమాలో కన్నడ భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సినిమా రిలీజ్ అవకుండానే కృతి శెట్టికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. 

అసలైతే సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. లాక్ డౌన్ టైం లో ఓటిటి ఆఫర్స్ వచ్చినా సరే వద్దని చెప్పిన ఉప్పెన దర్శకనిర్మాతలు ఫైనల్ గా 2020 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ లోనే సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు అడిగినా నిర్మాతలు ఇవ్వలేదు. ఫైనల్ గా ఆఫ్టర్ థియేటర్ రిలీజ్ నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన రిలీజ్ అవనుంది.