ఆచార్య సెట్ లో కొత్త జంట..!

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతం కిచ్లుని పెళ్లాడిన విషయం తెలిసిందే. 7 ఏళ్ల పరిచయం 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఫైనల్ గా అక్టోబర్ 30న ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్లొచ్చిన ఈ కొత్త జంట లేటెస్ట్ గా ఆచార్య సెట్ లో ప్రత్యక్షమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో కాజల్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఆగిపోయిన షూటింగ్ ఈరోజు మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లొకేషన్ లో గౌతం, కిచ్లులతో కేక్ కట్ చేయించారు చిరంజీవి. కొత్త జంటకు తన ఆశీర్వాదాలు అందించారు మెగాస్టార్ చిరంజీవి.

చిత్రయూనిట్ సమక్షంలో గౌతం, కాజల్ ఇద్దరు దండలు మార్చుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన కాజల్ ఆచార్య తర్వాత వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగించవచ్చని అక్కినేని కోడలు సమంత ప్రూవ్ చేసింది. ఆమె దారిలోనే కాజల్ కూడా పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని అంటుంది.