మహేష్ ఒక్కడు సీక్వల్ ప్లానింగ్..!

సూపర్ స్టార్ మహేష్ ఒక్కడు సినిమా సీక్వల్ తీస్తా అంటున్నాడు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఒక్కడు నిర్మాత ఎం.ఎస్ రాజు. నిర్మాతగా వెనక పడ్డ ఎమ్మెస్ రాజు డైరక్టర్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా డర్టీ హరి అనే సినిమా తీసి ఏటిటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కడు సీక్వల్ ప్లానింగ్ లో ఉందని అన్నారు ఎమ్మెస్ రాజు. మహేష్ తోనే ఈ సీక్వల్ ఉంటుందని.. ఒక్కడు 2 మొదటి సినిమాను మించి ఉంటుందని చెప్పారు.

అయితే అంతా బాగుంది కాని ఇప్పుడు మహేష్ ఒక్కడు సీక్వల్ చేస్తాడా అన్నదే డౌట్. మాములుగానే రీమేక్ లను, సీక్వల్ లను ఇష్టపడని మహేష్ ఒక్కడు సీక్వల్ కు ఓకే చెబుతాడ లేదా అన్నది తెలియాల్సి ఉంది. గుణశేఖర్ తో ఆల్రెడీ అర్జున్, సైనికుడు సినిమాలు చేసిన మహేష్ మరోసారి అలాంటి రిస్క్ తీసుకోడని చెప్పొచ్చు. మరి ఒక్కడు 2 మహేష్ కాకుండా చేస్తార లేక మహేష్ ను ఒప్పించి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.