
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత తన ఫామ్ ను ఏమాత్రం కోలోలేదు. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు పెద్దగా డిమాండ్ ఉండదు. అవకాశాలు కూడా అడపాదడపా మాత్రమే వస్తాయి కాని సమంత మాత్రం ఆ విషయంలో సూపర్ అని చెప్పాలి. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. సినిమాలతోనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద కూడా సమంత తన సత్తా చాటుతుంది.
ఆహా కోసం సమంత స్పెషల్ టాక్ షో సామ్ జామ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె కెరియర్ గురించి స్పందించింది సమంత. తను చాలా లక్కీ అని.. పెళ్లి తర్వాత వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నది సమంత. పెళ్లి తర్వాత అవకాశాలు వస్తాయని అనుకోలేదు దానికి సిద్ధమయ్యే పెళ్లి చేసుకున్నా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా స్టార్ ఛాన్సులు వస్తాయని అనుకోలేదు. అయితే అదృష్టం కొద్దీ అలా జరుగుతుననయి అని అంటుంది సమంత. రంగస్థలం సినిమా పెద్ద హిట్ అవడం తనకు బాగా కలిసి వచ్చిందని అన్నది సామ్. మొత్తానికి సమంత పెళ్లి తర్వాత డబుల్ ఎనర్జీతో ఆఫర్లు అందుకుంటుంది.