నక్సలైట్ రవన్న.. విరాటపర్వం రానా ఫస్ట్ లుక్..!

 దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విరాటపర్వం. నీది నాది ఒకే కథ సినిమాతో టాలెంట్ చూపించిన వేణు ఊడుగుల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవిశంకర్ అలియాస్ రవన్న పాత్రలో నటిస్తున్నాడు. డిసెంబర్ 14 సోమవారం అనగా ఈరోజు దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా విరాట పర్వం సినిమా నుండి రానా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. 


దగ్గుబాటి వారసుడిగా ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు రానా. బాహుబలి సినిమాలో భళ్లాలదేవ పాత్రలో రానా తప్ప మరెవరిని ఊహించలేం అనేలా తన సత్తా చాటాడు. మొత్తానికి వెంకటేష్ లానే రానా కూడా అన్ని ప్రయోగాలు చేస్తూ దగ్గుబాటి మేనియా కొనసాగిస్తున్నాడు.