అల్లు 'రామాయణం'.. డైరక్టర్ అతనేనా..?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అర్జున్ బాలీవుడ్ నిర్మాలతో కలిసి రామాయణ ప్రాజెక్ట్ ను చేయాలని అనుకున్నారు. ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి సైలెంట్ గా ఉండగా లేటెస్ట్ గా 1000 కోట్ల రామాయణ సినిమాకు డైరక్టర్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని టాక్.

ఇప్పటికే రామాయణాన్ని సినిమా కథగా మలిచేందుకి త్రివిక్రం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది కూడా త్వరలో తెలుస్తుంది. మెగా హీరోల్లో ఒకరు రాముడు పాత్రలో కనిపిస్తారని తెలుస్తుండగా రాం చరణ్, అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరు ఆ పాత్రకు సెలెక్ట్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది.