
బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5 ఫైనలిస్ట్ ఎవరన్నది తెలిసిపోయింది. 100 రోజుల ప్రయాణం.. 19 మంది కంటెస్టంట్స్ లో ఫైనల్ గా ఐదుగురు ఫైనల్ వీక్ కు చేరుకున్నారు. వీరిలో టాప్ 2ని ఓటింగ్ ద్వారా ఎంపిక చేసి వారిలో టైటిల్ విజేతని ప్రకటిస్తారు. 16 మంది డైరెక్ట్ కంటెస్టంట్స్ గా.. ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ సీజన్ 4 ఆడియెన్స్ ను అలరించడంలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.
నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సీజన్ 4లో టాప్ 5లో అఖిల్, సోహెల్, అభిజిత్, అరియానా, హారిక స్థానం సంపాదించుకున్నారు. వీరిలో ఎవరు ఫైనల్ విన్నర్ గా టైటిల్ గెలుస్తారో చూడాలి. అయితే బయట ఆడియెన్స్ ఓటింగ్స్ చూస్తుంటే ఈసారి విన్నర్ గా అభిజిత్ అవుతాడని తెలుస్తుంది. అయితే అన్ని అన్ అఫీషియల్ పోల్స్ లో అభిజిత్ టాప్ లో ఉండగా అఫీషియల్ గా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. డిసెంబర్ 20 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ జరుగనుంది. స్టర్ హీరో ఒకరు గెస్ట్ గా వచ్చి విజేతకు టైటిల్ కప్ అందిస్తారని టాక్.