సంబంధిత వార్తలు

కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమాను ప్రభాస్ తో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. సలార్ అంటూ వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా మరో ఇద్దరు స్టార్స్ నటిస్తారని టాక్. ఇంతకీ ప్రభాస్ సలార్ లో ఎవరెవరు నటిస్తారు అంటే.. రానా ఇంకా మోనల్ లాల్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని తెలుస్తుంది.
ప్రభాస్ సలార్ సినిమాలో వారిద్దరు యాడ్ అయితే మాత్రం మరింత క్రేజ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం రాధే శ్యాం సినిమా చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. సలార్ తో ప్రభాస్ పెద్ద టార్గెట్టే ఫిక్స్ చేసుకున్నట్టు ఉన్నాడని తెలుస్తుంది.