
విక్టరీ వెంకటేష్ హీరోగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా వస్తున్న సినిమా నారప్ప. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. సినిమా మొదలుపెట్టిన రోజే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సర్ ప్రైజ్ చేసిన చిత్రయూనిట్ డిసెంబర్ 13 వెంకటేష్ బర్త్ డే కానుకగా ఒకరోజు ముందే నారప్ప టీజర్ రిలీజ్ చేశారు.
వెంకటేష్ మాస్ అండ్ యాక్షన్ మోడ్ తో వచ్చిన ఈ టీజర్ అలరించింది. అయితే జస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే వదిలి సినిమా టీజర్ వదలడం జరిగింది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. వెంకటేష్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తప్పకుండా దగ్గుబాటి ఫ్యాన్స్ ను, తెలుగు ఆడియెన్స్ ను అలరించే అవకాశం ఉంది.