పవర్ స్టార్ పార్ట్ టైం సింగర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం హీరోగానే కాదు అప్పుడప్పుడు సింగర్ గా కూడా మారుతాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్ట్ టైం సింగర్ గా కూడా మారబోతున్నారట. వకీల్ సాన్ తర్వాత ఐదారు సినిమాలు ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్ మళయాళ సినిమా అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న సినిమాలో ఓ సాంగ్ పాడనున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలిసిందే. సినిమాలో పవన్ తో ఓ సాంగ్ పాడించాలని ఫిక్స్ అయ్యాడట థమన్. పవర్ స్టార్ తో దేవి శ్రీ ప్రసాద్ అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా సాంగ్ పాడించగా అజ్ఞాతవాసి సినిమాలో అనిరుధ్ కూడా కొడకా కోటేశ్వర రావు సాంగ్ పాడించాడు. ఇక లేటెస్ట్ గా సూపర్ హిట్ రీమేక్ కోసం కూడా పవన్ ను సింగర్ గా మారుస్తున్నాడని తెలుస్తుంది.