
అక్కినేని కోడలు సమంత డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై సత్తా చాటుతుంది. ఆహా కోసం సమంత సామ్ జామ్ షో చేస్తున్న విషయం తెలిసిందే. సమంత హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి మొదటి గెస్ట్ గా విజయ్ దేవరకొండ సెకండ్ గెస్ట్ గా రానా వచ్చారు. ఇక ఈమధ్యనే తమన్నా ఎపిసోడ్ అప్లోడ్ చేయగా మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ త్వరలో అప్ లోడ్ చేస్తారని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా ఆహా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా వస్తున్నట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ తో సమంత స్పెషల్ చిట్ చాట్ స్పెషల్ గా ఉండనుందని చెప్పొచ్చు. ఈ షోకి సంబందించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్, సమంత కలిసి జోడీ కట్టారు మరి ఈ టాక్ షో ఎలా ఉండబోతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.