
మహానటి తర్వాత తెలుగులో కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు వరుస సినిమాలతో జోష్ మీద ఉంది. అమ్మడు నటించిన మిస్ ఇండియా రిలీజ్ అవగా గుడ్ లక్ సఖి రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక నితిన్ తో రంగ్ దే సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తుంది కీర్తి సురేష్. జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా 2021 ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
ఇవే కాకుండా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కార్తిక్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. థ్రిల్లర్ మూవీగా ప్లాన్ చేసిన ఈ సినిమాకు సుకుమార్ సహకారం అందిస్తున్నారట. ఈ సినిమాలో మెగా హీరోకి జోడీగా కీర్తి సురేష్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలుగులో వరుస స్టార్ అవకాశాలతో కీర్తి తన ఫాం కొనసాగిసుతందని చెప్పొచ్చు.