
కరోనా లాక్ డౌన్ టైంలో వలస కార్మికులను గమ్యస్థానాలకు చేరుకునేలా చూసిన సోనూ సూద్ ఆ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సినిమాల్లో విలన్ గా నటిస్తున్న సోనూ సూద్ బయట మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. సోనూ సూద్ చేస్తున్న ఈ పనులకు మంచి ప్రోత్సాహకాలు అందుతున్నాయి. లేటేస్ట్ గా ప్రముఖ యూకే మ్యాగజైన్ ఈస్ట్రన్ ఐ ఏషియన్ సెలబ్రిటీ గ్లోబల్ 2020 పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో సోనూసూద్ నెంబర్ 1 గా నిలవడం విశేషం.
వలస కార్మికులకు సాయంగా నిలిచినందుకు సోనూసూద్ కు ఈ స్థానం ఇచ్చినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈస్ట్రన్ ఐ మ్యాగజైన్ నంబర్ 1 స్థానంలో నిలిచిన సోనూసూద్ ఈ గౌరవం తన బాధ్యతని మరింత పెంచిందని.. దేశ ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహం వచ్చిందని.. తుది శ్వాస వరకు ఈ సేవలు కొనసాగిస్తానని అన్నారు. తనని గుర్తించి ఈ అవార్డ్ ఇచ్చినందుకు ఈస్ట్రన్ ఐ మ్యాగజైన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు సోనూసూద్.