
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్మాల్ స్క్రీన్ పై మరోసారి హోస్ట్ గా కనిపించనున్నారా..? ఈ వార్త రాగానే ఇంకేంటి బిగ్ బాస్ ఐదవ సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా కన్ ఫాం అని ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. కాని ఎన్.టి.ఆర్ చేసేది బిగ్ బాస్ కాదు.. మీలో ఎవరు కోటీశ్వరుడు సీక్వెన్స్. స్టార్ మాలో మూడు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్ మాతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని జెమినితో చేతులు కలిపారట.
ఈ షోకి హోస్ట్ గా తారక్ చేస్తాడని తెలుస్తుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు షో టైటిల్ ను కూడా మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎం.ఈ.కే మొదటి రెండు సీజన్లకు కింగ్ నాగార్జున హోస్ట్ చేయగా మూడవ సీజన్ ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు. ఇక లేటెస్ట్ గా సీజన్ 4ని ఎన్.టి.ఆర్ హోస్ట్ చేస్తారని టాక్. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ కూడా వేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఎన్.టి.ఆర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి చేశాక ఎన్.టి.ఆర్ ఈ షోని హోస్ట్ చేస్తారని తెలుస్తుంది.