రెండు పాత్రల్లో ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్. సినిమా ఫస్ట్ లుక్ లో విక్రమాదిత్యగా సూపర్ లుక్ తో కనిపించారు ప్రభాస్. అయితే సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాక్. రెండు పాత్రలు ఉంటాయా.. లేక ఒకే పాత్ర వేరియేషన్స్ లో నటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో ప్రభాస సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ 200 కోట్ల పైన బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. 2021 సమ్మర్ టార్గెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా భారీ రేంజ్ లో రాబోతుందని అర్ధమవుతుంది.