అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్..!

బాహుబలి తర్వాత ప్రభాస్ తెలుగు నిర్మాతలకు దొరకట్లేదని చెప్పొచ్చు. ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాల్సిందే అన్న రేంజ్ కు తన మార్కెట్ వెళ్లింది. అందుకే ప్రభాస్ కేవలం తెలుగు సినిమాలు తీయాలన్న ఆలోచనని పక్కన పెట్టేశాడు. అలా కమిటైన సినిమాలను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా అంటే 300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే.. నేషనల్ వైడ్ గా ఆ సినిమా రిలీజ్ చేయాల్సిందే.

ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకున్న ఓ రెండు నిర్మాణ సంస్థలు ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే వారితో సినిమాలు తీసే ఉద్దేశం లేని ప్రభాస్ వారు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు ప్రొడక్షన్ లు ప్రభాస్ తో 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఇప్పుడు సినిమా చేయడం అంటూ జరిగితే అది నేషనల్ వైడ్ గా రిలీజ్ అవ్వాల్సిందే అనే డిమాండ్ లో ఉన్నాడు అందుకే ఈ రెండు ప్రొడక్షన్ లు ప్రభాస్ తో సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాయి. వారి ఇచ్చిన అడ్వాన్స్ కూడా ప్రభాస్ తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తుంది.