
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో భారీ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే జక్కన్నతో సినిమా అంటే రెండు, మూడేళ్లు డేట్స్ ఇచ్చేయాల్సిందే. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. అసలైతే త్రివిక్రం తో సినిమా ఉంటుందని వార్తలు రాగా ఆ ప్రాజెక్ట్ కన్ ఫాం అవ్వలేదు. ఇక లేటెస్ట్ గా మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది.
ఆల్రెడీ మహేష్ తో మహర్షి సినిమాను తీసి హిట్ అందుకున్న వంశీ మహేష్ కోసం మరో కథ రాసుకున్నాడు అయితే ముందు ఓకే అన్న మహేష్ తర్వాత సినిమా వద్దనుకున్నాడు. అయితే ఆ కథ పక్కన పెట్టి మహేష్ కోసం మరో కథ రాసుకున్నాడత వంశీ పైడిపల్లి. ఈ సినిమా కథ ప్రకారం మూవీకి టైటిల్ గా స్టేట్ రౌడీ అని పెడతారని టాక్. మహేష్ సినిమాకు ఇంత మాస్ టైటిల్ అది కూడా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ అనగానే సినిమాపై సూపర్ క్రేజ్ వచ్చింది. మరి వంశీ పైడిపల్లి నిజంగానే మహేష్ తో స్టేట్ రౌడీ తీస్తాడా లేదా అన్నది చూడాలి.