విరాటపర్వంలో మరో హీరోయిన్..!

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు ఊడిగుల తన నెక్స్ట్ సినిమాను రానాతో చేస్తున్నాడు విరాట పర్వం టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు సంబందించిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో సాయి పల్లవితో పాటుగా మరో హీరోయిన్ నటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

విరాట పర్వంలో నటించే మరో హీరోయిన్ ఎవరంటే నివేదా థామస్ అని తెలుస్తుంది. నాని జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నివేదా వరుస సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. యువ హీరోల సరసన నటిస్తూ పాపులారిటీ తెచ్చుకున్న అమ్మడు స్టార్ ఛాన్సులను దక్కించుకోవడంలో మాత్రం వెనకపడ్డది. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవితో పాటుగా నివేదా థామస్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.