
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కె.జి.ఎఫ్ సూపర్ హిట్ అవడంతో చాప్టర్ 2 మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కె.జి.ఎఫ్ కు కొనసాగింపుగా చాప్టర్ 2 భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు.
ఇక ప్రభాస్ సలార్ సినిమాని కూడా కె.జి.ఎఫ్ రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో హీరోయిన్ గా దిశా పటానిని సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన దిశా పటాని తెలుగులో లోఫర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న అమ్మడు ప్రభాస్ సలార్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. దిశా పటాని సౌత్ కెరియర్ కు సలార్ బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.